‘కె ర్యాంప్’ ట్రైలర్.. కొత్త స్వాగ్ లో కిరణ్

ఈ దీపావళికి థియేటర్లలో ‘కె ర్యాంప్‘ ఆడించడానికి రెడీగా ఉన్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. గత సంవత్సరం దీపావళికి ‘క‘తో ఘన విజయాన్నందుకున్న కిరణ్.. ఈ దివాళికి ‘కె ర్యాంప్‘తో హిట్ కొడతాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా డెబ్యూ డైరెక్టర్ జైన్స్ నాని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. రాజేష్ దండా, శివ బొమ్మాక్ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.
ట్రైలర్ విషయానికొస్తే.. ఇప్పటివరకూ కిరణ్ ఎక్కువగా రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ లో నటించాడు. అయితే.. ఈ సినిమాకోసం ఓ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, స్వాగ్ తో ఆడియన్స్ కి సరికొత్త ఎంటర్ టైన్ మెంట్ అందించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కిరణ్ కి జోడీగా యుక్తి తరేజా నటించగా, ఇతర కీలక పాత్రల్లో నరేష్, వెన్నెల కిషోర్ వంటి వారు కనిపించబోతున్నారు. మొత్తంగా.. కథ కంటే కామెడీ పంచెస్ కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి.. ఆడియన్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేయడానికి అక్టోబర్ 18న ‘కె ర్యాంప్‘ థియేటర్లలోకి వచ్చేస్తోంది.
-
Home
-
Menu