‘K ర్యాంప్’ టీజర్ టాక్!

‘K ర్యాంప్’ టీజర్ టాక్!
X
‘క‘ ఘన విజయం తర్వాత కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ముందుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది ‘K ర్యాంప్‘.

‘క‘ ఘన విజయం తర్వాత కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ముందుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది ‘K ర్యాంప్‘. యుక్తి తరేజా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్స్ పై రాజేశ్ దండ, శివ బొమ్మక్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, జైన్స్ నాని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజయ్యింది.

టీజర్‌ను బట్టి చూస్తే సినిమా పూర్తిగా లవ్, యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతుందని స్పష్టమవుతోంది. కొన్ని రొమాంటిక్ సీన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు బోల్డ్ డైలాగ్స్ కూడా సినిమాలో ఎక్కువగానే ఉండబోతున్నట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు కేరళలోనే పూర్తి చేశారు. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. దీపావళి కానుకగా అక్టోబర్ 18న ‘K ర్యాంప్‘ థియేటర్లలోకి రాబోతుంది.



Tags

Next Story