సీక్రెట్ మిషన్ లో ‘జాక్’

సీక్రెట్ మిషన్ లో ‘జాక్’
X
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ ‘జాక్‘. ‘బేబి‘ ఫేమ్ వైష్ణవి చైతన్య సిద్ధుకి జోడీగా నటించింది. ‘బొమ్మరిల్లు‘ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ ‘జాక్‘. ‘బేబి‘ ఫేమ్ వైష్ణవి చైతన్య సిద్ధుకి జోడీగా నటించింది. ‘బొమ్మరిల్లు‘ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. సీనియర్ ప్రొడ్యూసర్ బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా ప్రచారంలో స్పీడు పెంచారు మేకర్స్. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఇప్పటివరకూ సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమాల్లో ఎక్కువగా రొమాన్స్ కనిపిస్తుంది. అయితే ఈ మూవీలో సిద్ధు రొమాన్స్ తో పాటు యాక్షన్ లోనూ ఇరగదీసినట్టు తెలుస్తోంది. పైకి మామూలుగా కనిపించే జాక్.. ఏదో సీక్రెట్ మెషిన్ చేస్తున్నట్టు, అందుకోసం ఎంతో రిస్క్ కూడా చేసినట్టు ట్రైలర్ లో చూపించారు. ఈ ట్రైలర్ లో సిద్ధు, ప్రకాష్ రాజ్ సన్నివేశాలే ఎక్కువగా కనిపించాయి. మొత్తంగా ట్రైలర్ అయితే కొత్తగా అనిపిస్తుంది.

Tags

Next Story