బన్నీ సినిమాలో దీపికాా?

బన్నీ సినిమాలో దీపికాా?
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికాా పదుకునే ‘కల్కి 2898 ఏడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఈ విజువల్ ఎపిక్‌లో ఆమె పాత్రకు మంచి స్పందన రావడంతో, టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆమెను తమ ప్రాజెక్టులకు అప్రోచ్ చేయడం మొదలుపెట్టారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికాా పదుకునే ‘కల్కి 2898 ఏడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఈ విజువల్ ఎపిక్‌లో ఆమె పాత్రకు మంచి స్పందన రావడంతో, టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆమెను తమ ప్రాజెక్టులకు అప్రోచ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కే ‘స్పిరిట్’ సినిమాలో దీపికాా పేరు ఖరారైంది.

కానీ తాజా సమాచారం ప్రకారం, ఆమెను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. కారణం? ఆమె డిమాండ్లను తట్టుకోలేక, డైరెక్టర్ సందీప్ ఆమెను ప్రాజెక్ట్ నుంచి తొలగించాడట. మరోవైపు, తాను తల్లి అయిన నేపథ్యంలో, షూటింగ్ షెడ్యూల్స్‌పై కొన్ని సడలింపులు కోరినందునే ఆమెపై ఈ విధంగా నెగటివ్ ప్రచారం జరుగుతోందని ఆమె అభిమానులు వాదిస్తున్నారు.

అయితే 'స్పిరిట్' నుంచి తప్పుకున్నా.. మరో క్రేజీ ప్రాజెక్ట్ అందుకుందట దీపికా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో దీపికా మెయిన్ హీరోయిన్‌గా ఎంపికైనట్టు సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి ఏకంగా రూ.700 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారని, ఇందులో చాలామంది కథానాయికలు ఉన్నా దీపికా పాత్రకు స్పెషాలిటీ ఉండబోతుందని వినిపిస్తోంది.

ఇప్పటికే అట్లీ డైరెక్షన్ లో వచ్చిన 'జవాన్'లో దీపికా నటించడంతోనే.. అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌లోకి ఆమెను తీసుకున్నారట. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ విజువల్ గ్రాండియర్‌కు సంబంధించి హైదరాబాద్ లో ఏర్పాట్లు చేస్తున్నాడు డైరెక్టర్ అట్లీ. 'సన్ పిక్చర్స్' నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో విఎఫ్ఎక్స్ కీలక భూమిక పోషించనున్నాయి.

Tags

Next Story