'బాహుబలి 3' అనౌన్స్‌మెంట్ వస్తోందా?

పాన్ ఇండియా సినిమాల కొత్త యుగానికి నాంది పలికిన చిత్రం 'బాహుబలి'. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మాగ్నమ్ ఓపస్, తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి చేర్చింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ విజువల్ వండర్ ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో వస్తోంది.
ఈసారి మాత్రం సాధారణ రీ-రిలీజ్ కాదు. రాజమౌళి తన ప్రత్యేకతను చూపిస్తూ రెండు భాగాలను ఒకే చిత్రంగా కలిపి, కొత్త సన్నివేశాలు, ప్రత్యేక విజువల్ ఎఫెక్ట్స్‌తో కొత్త అనుభూతిని అందించబోతున్నాడు. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ ఎపిక్ రీ-రిలీజ్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది.
ఇక సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరో హాట్ టాక్ ఏమిటంటే 'బాహుబలి ది ఎపిక్' చివర్లో 'బాహుబలి 3' గురించిన సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ ఉంటుందట. ఇది నిజమైతే ప్రభాస్ అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు.
పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ ఇప్పటికే మూడు భారీ సిరీస్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. అవే 'బాహుబలి, సలార్, కల్కి'. ఈ మూడు ఫ్రాంచైజీలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న సిరీస్‌లుగా నిలిచాయి. ప్రభాస్ సిరీస్ వస్తుందంటే థియేటర్లు ఊగిపోవడం ఖాయం అన్నట్లే పరిస్థితి. ఇప్పుడు 'బాహుబలి: ది ఎపిక్'తో ఆ మ్యాజిక్ మళ్లీ రిపీట్ కానుంది.
-
Home
-
Menu