'పెద్ది' గురించి ఆసక్తికర అప్డేట్!

పెద్ది గురించి ఆసక్తికర అప్డేట్!
X
రామ్ చరణ్ కెరీర్ లో 'రంగస్థలం' చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. నటుడిగా చరణ్ ను మరో మెట్టు ఎక్కించిన చిత్రమిది. ఇప్పుడు 'రంగస్థలం'కు మించి 'పెద్ది' ఉంటుందనే ఆసక్తికర కామెంట్స్ చేశాడు రామ్ చరణ్.

రామ్ చరణ్ కెరీర్ లో 'రంగస్థలం' చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. నటుడిగా చరణ్ ను మరో మెట్టు ఎక్కించిన చిత్రమిది. ఇప్పుడు 'రంగస్థలం'కు మించి 'పెద్ది' ఉంటుందనే ఆసక్తికర కామెంట్స్ చేశాడు రామ్ చరణ్. లేటెస్ట్‌గా లండన్ లో జరిగిన మైనపు విగ్రహం ఆవిష్కరణ ప్రెస్ మీట్ లో చరణ్ ఈ కామెంట్స్ చేయడం విశేషం.

'రంగస్థలం' చిత్రంలో హీరోగా నటించిన చరణ్.. ఆ సినిమాకి అసోసియేట్ గా పనిచేసిన బుచ్చిబాబు.. ఇక అదే చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా 'పెద్ది' చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు.. కథాంశ పరంగానూ 'రంగస్థలం' తరహాలోనే 'పెద్ది' పీరియాడిక్‌ టచ్ తో రాబోతుంది. అందుకే.. 'రంగస్థలం, పెద్ది' చిత్రాల మధ్య కంపారిజన్.

మొత్తంగా.. పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో రూపొందుతున్న 'పెద్ది' చిత్రం ఇప్పటికే 30 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందని లండన్ వేడుకలో చరణ్ వెల్లడించాడు. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో శివరాజ్ కుమార్, జగపతిబాబు సందడి చేయబోతున్నారు. ఏ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వచ్చే యేడాది రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్ గా మార్చి 27న 'పెద్ది' రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags

Next Story