'విశ్వంభర'కి 'ఇంద్ర' సెంటిమెంట్?

టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ ఒకటి. వశిష్ట దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ సుమారు రూ. 200 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
'విశ్వంభర'లో చిరు హనుమంతుడి భక్తుడిగా కనిపించనున్నాడట. డివోషనల్ టచ్‌తో కూడిన సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ పనుల ఆలస్యం, కొన్ని సాంకేతిక అంశాలు, మ్యూజిక్ కంపోజిషన్ మార్పులు వంటివి విడుదల ఆలస్యానికి ప్రధాన సమస్యలుగా చెబుతున్నారు. ముఖ్యంగా ఓ స్పెషల్ సాంగ్ విషయంలో చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో, కీరవాణి ఆ ట్రాక్‌ను రీడిజైన్ చేస్తున్నట్టు టాక్.
ఇక 'విశ్వంభర' ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఫ్యాన్స్ కోసం ఈ చిత్రం జూలై 24న థియేటర్లలోకి రానుందనే ప్రచారం జరుగుతుంది. ఇదే డేట్‌కు ‘ఇంద్ర’ రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ అయిందన్న నేపథ్యం ఉండటం, ఈ సినిమాపై సెంటిమెంటుగా మారుతోంది. మరోవైపు ఏప్రిల్ 12న 'విశ్వంభర' నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ పాటలో చిరు, సాయిదుర్గాతేజ్ కలిసి సందడి కనువిందు చేయనున్నారట.
‘భోళా శంకర్’ తర్వాత మెగా ఫ్యాన్స్ నిరాశలో ఉండగా, 'విశ్వంభర'పై అంచనాలు భారీగా పెరిగాయి. విజువల్స్, మ్యూజిక్, కథ – అన్నింటి పరంగా ఇది చిరు కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
-
Home
-
Menu