ఆకట్టుకుంటున్న అవ్రామ్ మేకింగ్ వీడియో!

ఆకట్టుకుంటున్న అవ్రామ్ మేకింగ్ వీడియో!
X
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ విడుదలకు వారం రోజులే సమయం ఉంది. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ చిత్రం కోసం వరుసగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది టీమ్.

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ విడుదలకు వారం రోజులే సమయం ఉంది. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ చిత్రం కోసం వరుసగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది టీమ్. ఈ సినిమాలో విష్ణు తనయుడు అవ్రామ్ కూడా నటించాడు. విష్ణు తిన్నడు పాత్రలో కనిపించబోతుండగా.. ఆ పాత్రకు సంబంధించి యంగ్ రోల్ లో అవ్రామ్ అలరించబోతున్నాడు. లేటెస్ట్ గా ‘కన్నప్ప‘ నుంచి అవ్రామ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు.

అవ్రామ్ మేకింగ్ వీడియోని విష్ణుతో పాటు మోహన్ బాబు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ మేకింగ్ వీడియోలో అవ్రామ్‌ సెట్లో ఉన్న క్షణాలు, కెమెరా ముందు నటిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో మంచు కుటుంబానికి సంబంధించిన మోహన్ బాబు, విష్ణు, అవ్రామ్ లతో పాటు.. విష్ణు కుమార్తెలు అరియానా – వివియానా కూడా కనిపించబోతుండటం విశేషం. మొత్తంగా మంచు కుటుంబానికి సంబంధించిన మూడు తరాలు కలిసి నటించడంతో ‘కన్నప్ప’ వారికి ఎంతో ప్రత్యేకమైన చిత్రంగా మారింది.

అవా ఎంటర్టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో ఉంది. జూన్ 27న ‘కన్నప్ప’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



Tags

Next Story