రేపు థియేటర్లలోకి ‘ఇడ్లీ కొట్టు‘

రేపు థియేటర్లలోకి ‘ఇడ్లీ కొట్టు‘
X
ఈ వారం థియేటర్లలోకి వస్తోన్న చిత్రాలలో ధనుష్ 'ఇడ్లీ కడై' ఒకటి. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకుడు కూడా ధనుష్ కావడం విశేషం.

ఈ వారం థియేటర్లలోకి వస్తోన్న చిత్రాలలో ధనుష్ 'ఇడ్లీ కడై' ఒకటి. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకుడు కూడా ధనుష్ కావడం విశేషం. 'పా పాండి, రాయన్, నిలవుక్కు ఎన్మేల్ ఎన్నడి కోబం' తర్వాత ధనుష్ దర్శకత్వం వహించిన నాలుగో సినిమా ఇది.

తమిళంలో 'ఇడ్లీ కడై'గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఇడ్లీ కొట్టు‘ పేరుతో అనువదించారు. ఈ చిత్రంలో ధనుష్ కి జోడీగా నిత్యా మీనన్ నటించింది. అరుణ్ విజయ్, రాజ్ కిరణ్, సత్యరాజ్, సముద్రఖని, పార్థిబన్, షాలిని పాండే వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఒక కుటుంబం, వారి ఇడ్లీ దుకాణం చుట్టూ అల్లుకున్న ఆసక్తికరమైన కథతో ఈ సినిమాని రూపొందించాడు ధనుష్. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై మంచి హైప్ ఏర్పడింది.

ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్‌బార్ స్టూడియోస్‌తో పాటు డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంగీతం జీవీ ప్రకాష్ అందించాడు. ‘కుబేర‘ వంటి విజయం తర్వాత ధనుష్ నుంచి వస్తోన్న ‘ఇడ్లీ కొట్టు‘ ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags

Next Story