‘ఓజీ’ కలెక్షన్ల వేట

‘ఓజీ’ కలెక్షన్ల వేట
X
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఇండస్ట్రీలో పండుగ వాతావరణం నెలకొంటుంది. లేటెస్ట్ గా ‘ఓజీ’ బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. నిన్నటి నుంచే ప్రీమియర్స్ తో మొదలైన 'ఓజీ' అంతకుముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కొత్త రికార్డులు నమోదు చేసుకుంది.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఇండస్ట్రీలో పండుగ వాతావరణం నెలకొంటుంది. లేటెస్ట్ గా ‘ఓజీ’ బాక్సాఫీస్‌ను కుదిపేస్తోంది. నిన్నటి నుంచే ప్రీమియర్స్ తో మొదలైన 'ఓజీ' అంతకుముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో కొత్త రికార్డులు నమోదు చేసుకుంది.

‘బుక్ మై షో’లోనే గడిచిన కొన్ని గంటల్లో లక్షల్లో టికెట్లు అమ్ముడవడం పవన్ క్రేజ్ ఎటువంటి స్థాయిలో ఉందో చెబుతోంది. ముఖ్యంగా నైజాంలో రికార్డు స్థాయి బుకింగ్స్ నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఒక్క రాత్రిలోనే ప్రీమియర్ షోలు హౌస్‌ఫుల్ కావడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.

ఒక్క నైజాం ఏరియాలోనే 366 ప్రీమియర్ షోలు వేయడం ఇండస్ట్రీలోనే అరుదైన విషయం. ఈ షోలు అన్నీ సెకన్ల వ్యవధిలోనే ఫుల్ అయ్యాయి. రూ.800 వరకు టికెట్ ధర ఉన్నప్పటికీ, అభిమానులు వెనుకడగు వేయలేదు. ఫస్ట్ డే వసూళ్లలో 125–140 కోట్ల గ్రాస్ సాధించే అవకాశం ఉందని అంచనా.

అమెరికా, యూకే, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ‘ఓజీ’ బుకింగ్స్ రికార్డులను తిరగరాస్తున్నాయి. నార్త్ అమెరికాలోనే 2.3 మిలియన్ డాలర్ల వసూలు సాధించగా, మొత్తం ఓవర్సీస్ ప్రీమియర్స్ కలిపి 3.3 మిలియన్ డాలర్లను దాటాయి. తొలి రోజు ఓవర్సీస్‌ కలెక్షన్లే 40 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండిట్స్ భావిస్తున్నారు.

తెలుగు సినిమాకు రాజధానిగా పేరొందిన విజయవాడలోనూ ‘ఓజీ’ అరుదైన రికార్డు సృష్టించింది. బెనిఫిట్, ప్రీమియర్ షోలు కలిసి కేవలం ఒక రోజులోనే 1.24 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదే మొదటిసారి. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుండగా, అభిమానులు పవన్ రేంజ్‌ను ఆరాధిస్తూ సంబరాలు చేస్తున్నారు. ఇక ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'ఓజీ'కి దసరా సీజన్ బాగా కలిసొచ్చే అవకాశం ఉంది.

Tags

Next Story