'ది ప్యారడైజ్' కోసం భారీ సెట్!

లేటెస్ట్‌గా ‘హిట్ 3’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బడా హిట్ అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఇక ఇప్పుడు తన తర్వాతి సినిమా 'ది ప్యారడైజ్'పై దృష్టి పెట్టాడు. ముఖ్యంగా ‘హిట్ 3’లో కనిపించిన ఇంటెన్స్, వలెంట్ నాని లుక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి వచ్చిన నేపథ్యంలో.. ‘ప్యారడైజ్’లో మరింత వైలెంట్ గా దర్శనమివ్వడానికి సిద్ధమవుతున్నాడు.
ఇప్పటికే 'దసరా' వంటి హిట్ అందుకున్న నాని-శ్రీకాంతో ఓదెల కలయికలో ఈ చిత్రం రూపొందుతుంది. తాజా సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లోని కోకాపేట వద్ద ఈ సినిమాకోసం భారీ బడ్జెట్‌తో ప్రత్యేకంగా ఓ బస్తీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారట. ఈ బస్తీ సెట్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది మామూలు సెట్లలా కాకుండా, ఒక నిజమైన పల్లె వాతావరణాన్ని తలపించేలా రూపొందిస్తున్నారట.
ఈ సెట్‌లోనే ప్రధానంగా సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం. ఆ సెట్లోనే జూన్ నుండి షెడ్యూల్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మొత్తంగా ఇప్పటికే అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ తో 'ది ప్యారడైజ్'పై అంచనాలు పెరిగాయి. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ తో రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకోసం నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
-
Home
-
Menu