'విశ్వంభర' వీఎఫ్ఎక్స్ ఖర్చు ఎంత?

విశ్వంభర వీఎఫ్ఎక్స్ ఖర్చు ఎంత?
X
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చుట్టూ ఆసక్తికరమైన అప్డేట్స్ వస్తున్నాయి. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సోషియో ఫాంటసీ జానర్‌లో రాబోతుండగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్ సినిమాపై అంచనాలను పెంచాయి.

ఇటీవల ఈ సినిమా వీఎఫ్ఎక్స్‌పై ఫోకస్ ఎక్కువగా మారింది. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కోసమే రూ.70-75 కోట్లు ఖర్చు పెడుతున్నారట. మరోవైపు అంత ఖర్చు పెట్టడం లేదు కేవలం రూ.30 కోట్లు మాత్రమే విజువల్ ఎఫెక్ట్స్ కు ఖర్చు చేస్తున్నారనే ప్రచారమూ ఉంది. ఏదేమైనా.. 'విశ్వంభర' విజువల్ ఎఫెక్ట్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు అనే దానిలో నిజం ఉంది.

ప్రస్తుతం చిత్రీకరణ దాదాపుగా పూర్తయినప్పటికీ, విడుదల తేదీపై క్లారిటీ లేదు. జూలై 24 అనే డేట్ గట్టిగా వినిపిస్తున్నా, అధికారిక ప్రకటన రాలేదు. చిరు గత చిత్రం 'భోళాశంకర్' డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమాకోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో త్రిష నాయికగా నటిస్తుండగా.. ఆషికా రంనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సంగీత దర్శకుడిగా ఎం.ఎం. కీరవాణి పని చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మొత్తం ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.250 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం.

Tags

Next Story