ఊరమాస్ గా ‘గిచ్చమాకు‘!

మే 1న థియేటర్లలోకి వచ్చిన ‘హిట్ 3‘ ఊర మాస్ ఎంటర్ టైనర్ గా ఆడియన్స్ ను అలరించింది. మళ్లీ నెల రోజుల గ్యాప్ తర్వాత మే 30న థియేటర్లలోకి రాబోతుంది మరో మాస్ ఎంటర్ టైనర్ ‘భైరవం‘. బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ కలయికలో మల్టీస్టారర్ గా ఈ చిత్రాన్ని విజయ్ కనకమేడల తెరకెక్కించాడు.
‘నాంది, ఉగ్రం‘ వంటి ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్స్ అందించిన విజయ్ కనకమేడల ఈసారి రీమేక్ తీసుకున్నాడు. అయినా.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ‘భైరవం‘లో చాలానే మార్పులు చేశాడు. ముఖ్యంగా తమిళ ఒరిజినల్ ‘గరుడన్‘లో పాటలు పెద్దగా ఉండవు. అయితే.. తెలుగు వెర్షన్ లో మాత్రం పాటలను ఇరికించి తన మార్క్ కమర్షియాలిటీని స్పష్టంగా చూపించబోతున్నాడు డైరెక్టర్ విజయ్ కనకమేడల.
ఇప్పటికే ‘భైరవం‘ నుంచి వచ్చిన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా ‘గిచ్చమాకు‘ లిరికల్ సాంగ్ రిలీజయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్, అదితి శంకర్ మధ్య ఊర మాస్ గా ఈ పాట ఆకట్టుకుంటుంది. శ్రీ చరణ్ పాకాల మాసీ ట్యూన్ కి కాసర్ల శ్యామ్ లిరిక్స్ రాయగా.. ధనుంజయ్ సీపాన, సౌజన్య భాగవతుల ఈ పాటను ఆలపించారు. ఈ పాటలో బెల్లంకొండ శ్రీనివాస్, అదితి డ్యాన్సుల్లో అదరగొడుతున్నాడు.
-
Home
-
Menu