20 రోజుల్లోనే ఓటీటీలోకి ‘ఘాటి’!

టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘ఘాటి’ థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. లేటెస్ట్ గా ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సెప్టెంబర్ 5న రిలీజై మిక్స్‌డ్ రివ్యూస్ తెచ్చుకుంది. కథా నేపథ్యం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, తెరపైన చెప్పిన తీరు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
థియేటర్లలో విడుదలైన కేవలం 20 రోజుల్లోనే 'ఘాటి' డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈరోజు (సెప్టెంబర్ 26) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఘాటి’ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది.
ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని కనుమల ప్రాంతంలో గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంగా సాగే ఈ కథలో, అనుష్క శీలవతి పాత్రలో కనిపించింది. తమిళ నటుడు విక్రమ్ ప్రభు హీరోగా నటించగా.. జగపతి బాబు, చైతన్య రావు, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో కనిపించారు. మరి.. బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోని 'ఘాటి' ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
-
Home
-
Menu