స్టైలిష్ స్టార్ నుంచి నేషనల్ ఐకాన్ వరకు!

స్టైలిష్ స్టార్ నుంచి నేషనల్ ఐకాన్ వరకు!
X
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉరకలేసే ఉత్సాహానికి కేరాఫ్ అడ్రస్ అంటే అల్లు అర్జున్. ఎనర్జిటిక్ డ్యాన్స్, మాస్ అప్పీల్, కథల ఎంపికలో వైవిధ్యం—ఇవి అన్ని కలిసే బన్నీని ప్రత్యేకంగా నిలిపాయి.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉరకలేసే ఉత్సాహానికి కేరాఫ్ అడ్రస్ అంటే అల్లు అర్జున్. ఎనర్జిటిక్ డ్యాన్స్, మాస్ అప్పీల్, కథల ఎంపికలో వైవిధ్యం—ఇవి అన్ని కలిసే బన్నీని ప్రత్యేకంగా నిలిపాయి.

చిరంజీవి ఇంట్లో పెరిగిన బన్నీ, మెగా ఫ్యామిలీ గుర్తింపు తీసుకుని, అల్లు అనే ప్రత్యేక బ్రాండ్‌గా ఎదిగాడు. మళయాలంలో స్టార్ మార్కెట్ సంపాదించిన తొలి తెలుగు హీరోగా, బాలీవుడ్‌లోనూ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న అతని ప్రయాణం ప్రతిభకు నిదర్శనం.

'గంగోత్రి'తో హీరోగా తెరంగేట్రం చేసిన బన్నీ, రెండో సినిమానే అయినా 'ఆర్య'తో ట్రెండ్ సెట్టర్‌గా మారాడు. స్క్రీన్‌పై కేవలం నటించ‌డ‌మే కాదు… డాన్స్‌, ఫైట్స్‌, ఎమోష‌న్స్‌— అన్నింటికీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

కేబుల్ రాజ్ గా ‘వేదం’లో, గోన గన్నారెడ్డిగా ‘రుద్రమదేవి’లో, బన్నీ ఎంత విలక్షణంగా పాత్రలను ఎంచుకుంటాడో తెలుస్తుంది. మాస్ లో మంటపెట్టే 'బన్నీ', ‘రేస్ గుర్రం’, ‘సరైనోడు’, ‘దువ్వాడ జగన్నాథం’ వంటి సినిమాలు మరో కోణం చూపిస్తాయి.

బ్రాండ్ బిల్డింగ్‌లోనూ బ‌న్నీ ఓ స్టెప్ ముందే. ప్రొఫెష‌న‌ల్ పీఆర్‌ టీమ్‌, స్మార్ట్ మార్కెటింగ్‌తో దేశం మొత్తంలో తన క్రేజ్ పెంచుకున్నాడు. ‘పుష్ప‌’తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అతని మేనరిజం అంతర్జాతీయంగా వైర‌ల్ అయ్యింది. క్రికెట‌ర్లు సైతం అనుస‌రించారంటే, అది ఆయన పాపులారిటీకి నిద‌ర్శ‌నం.

'పుష్ప: ది రైజ్' అల్లు అర్జున్ ని నేషనల్ స్టార్‌గా మార్చేసింది. ఫాలోఅప్‌గా వచ్చిన 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్ల గ్రాస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో నిలిచిపోయింది. అయితే ఈ విజయాల వెనుక ఎన్నో అడ్డంకులు. ‘చెప్ప‌ను బ్ర‌ద‌ర్‌’ వంటి మాటల ద‌గ్గ‌ర నుంచి, సంధ్య థియేట‌ర్ దుర్ఘ‌ట‌న వ‌ర‌కు… చాలా విమ‌ర్శ‌లు, ట్రోలింగ్ ఎదురైంది. కానీ త‌ను ఒక్క‌సారి కూడా వెన‌క్కి తిప్పి చూసుకోలేదు.

ఇప్పుడు అట్లీ, త్రివిక్ర‌మ్‌ల‌తో సినిమాలు సిద్ధ‌మవుతున్నాయి. బాలీవుడ్ ద‌ర్శ‌కులు ఎదురుచూస్తున్నారు. బ‌న్నీ మాత్రం… 'ఇంకా ముందే న‌డవాలి' అన్న న‌మ్మ‌కంతో త‌న ప‌ని తాను చేస్తూ పోతున్నాడు. ఈరోజు అల్లు అర్జున్ బర్త్‌డే స్పెషల్ గా ఐకాన్ స్టార్ కు బర్త్ డే విషెస్ చెబుతుంది తెలుగు 70 ఎమ్.ఎమ్..

Tags

Next Story