మేడమ్ టుస్సాడ్స్ చరిత్రలో తొలిసారి!

మేడమ్ టుస్సాడ్స్ చరిత్రలో తొలిసారి!
X
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఖాతాలో మరో అరుదైన గౌరవాన్ని నమోదు చేసుకున్నాడు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరించబడింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన ఖాతాలో మరో అరుదైన గౌరవాన్ని నమోదు చేసుకున్నాడు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లండన్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరించబడింది. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత ఈ ఘనత పొందిన మూడో నటుడిగా చరణ్ నిలిచాడు. ప్రత్యేకత ఏమిటంటే, ఈ విగ్రహావిష్కరణలో ఆయన పెంపుడు కుక్క ‘రైమ్’ మైనపు బొమ్మను కూడా ప్రదర్శించారు. టుస్సాడ్స్ చరిత్రలో ఓ సెలబ్రిటీ పెంపుడు జంతువుతో కలిసి మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.

భారత కాలమానం ప్రకారం మే 10 సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసన, చిన్నారి క్లీంకార హాజరయ్యారు. విగ్రహం ఆవిష్కరణ అనంతరం చరణ్ – రైమ్ ఇద్దరూ తమ విగ్రహాల పక్కన కూర్చొని ఫోటోలు దిగారు. రైమ్, తన మైనపు ప్రతిమను చూసి తడబడ్డ ఘటన చిన్న హైలైట్‌గా మారింది.

వర్క్ ఫ్రంట్ లోకి వస్తే 'గేమ్ ఛేంజర్' తర్వాత ప్రస్తుతం చరణ్ 'పెద్ది' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన 'పెద్ది' గ్లింప్స్‌ కు సూపర్బ్ రెస్పాన్స్ దక్కింది. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో క్రీడల ఇతివృత్తంగా తెరకెక్కుతుంది. 2026, మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా 'పెద్ది' రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags

Next Story