ప్రముఖ సినీ, టీవీ నటుడు కన్నుమూత!

ప్రముఖ సినీ, టీవీ నటుడు కన్నుమూత!
X
తెలుగు సినీ మరియు టెలివిజన్ రంగంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన అల్లం గోపాలరావు (75) ఈ రోజు ఉదయం 8 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు.

తెలుగు సినీ మరియు టెలివిజన్ రంగంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన అల్లం గోపాలరావు (75) ఈ రోజు ఉదయం 8 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం సినీ, టీవీ రంగంలోని వారిని, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. గోపాలరావు తనదైన నటనా శైలితో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు.

గోపాలరావుకి భార్య విమల, ఇద్దరు కుమారులు అనిల్, సునీల్‌ ఉన్నారు. వారి పెద్ద కుమారుడు అనిల్ కూడా తండ్రి బాటలోనే సినిమాలు, సీరియళ్లలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. గోపాలరావు భౌతికకాయాన్ని సందర్శించడానికి ఈ రోజు ఉదయం నుంచి అనేక మంది సినీ ప్రముఖులు, సహ నటులు, దర్శకులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో శాస్త్రోక్తంగా జరగనున్నాయి.

Tags

Next Story