'కన్నప్ప' ట్రైలర్‌పై అంచనాలు

కన్నప్ప ట్రైలర్‌పై అంచనాలు
X
మంచు విష్ణు ప్రధాన పాత్రలో 'మహాభారతం' సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో 'మహాభారతం' సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అందుకు సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ విడుదలతో సినిమా ప్రమోషన్స్ మరింత వేగం అందుకోనున్నాయి.

విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ చిత్రం శివ భక్తుడైన కన్నప్ప జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించారు. ఇటీవల విడుదలైన టీజర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ట్రైలర్‌తో ఈ హైప్‌ను మరింత పెంచాలన్నది మేకర్స్ ప్లాన్.

భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీ విజువల్స్ పరంగా ఆడియన్స్ కు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందని నమ్ముతుంది టీమ్. జూన్ 27న 'కన్నప్ప' పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది.

Tags

Next Story