టాలీవుడ్ లో దీపావళి సందడి

దసరా సీజన్ ముగిసింది. ఇప్పుడు టాలీవుడ్ కి దీపావళి సందడి మొదలైంది. దీపావళి బరిలో విడుదలవుతున్న 'మిత్రమండలి, డ్యూడ్, తెలుసు కదా, కె-ర్యాంప్' సినిమాలు ప్రచారంలో స్పీడు పెంచాయి. ఇప్పటికే వీటిలో 'మిత్రమండలి, డ్యూడ్' మూవీస్ ట్రైలర్స్ తో వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 'తెలుసు కదా, కె-ర్యాంప్' ట్రైలర్స్ విడుదలకు ముస్తాబవుతున్నాయి.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘కె-ర్యాంప్’ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్ 10న ఉదయం 11.07కి రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’ కూడా రిలీజ్ మోడ్‌లో ఉంది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాపైనా భారీ బజ్ నెలకొంది. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్‌ను అక్టోబర్ 12న విడుదల చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
-
Home
-
Menu