‘పెద్ది‘ నుంచి దివ్యేందు లుక్!

‘పెద్ది‘ నుంచి దివ్యేందు లుక్!
X
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘పెద్ది‘పై భారీ అంచనాలున్నాయి. ‘ఉప్పెన‘ వంటి రూరల్ రొమాంటిక్ లవ్ స్టోరీ అందించిన బుచ్చిబాబు ఈ చిత్రాన్ని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ‘పెద్ది‘పై భారీ అంచనాలున్నాయి. ‘ఉప్పెన‘ వంటి రూరల్ రొమాంటిక్ లవ్ స్టోరీ అందించిన బుచ్చిబాబు ఈ చిత్రాన్ని పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా ప్లస్ పాయింట్స్.

నటీనటుల విషయానికొస్తే చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మ్యాన్లీ స్టార్ జగపతిబాబు వంటి వారు నటిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్‌ నటుడు, ‘మిర్జాపూర్‘ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈరోజు (జూన్ 19) దివ్యేందు పుట్టినరోజు సందర్భంగా, ఆయన లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. చేతిలో క్రికెట్ బాల్ పట్టుకుని మాస్ రగ్గడ్ గెటప్‌లో కనిపించిన దివ్యేందు, ఈ సినిమాలో ‘రామ్ బుజ్జి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన దివ్యేందు పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా మార్చ్ 27న రిలీజ్ కానుంది.



Tags

Next Story