దర్శకుడు రవికుమార్ చౌదరి కన్నుమూత!

దర్శకుడు రవికుమార్ చౌదరి కన్నుమూత!
X
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూశారు. గుండెపోటుతో రవికుమార్ చౌదరి కన్నుమూసినట్లు తెలుస్తోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి కన్నుమూశారు. గుండెపోటుతో రవికుమార్ చౌదరి కన్నుమూసినట్లు తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా 'యజ్ఞం' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు రవికుమార్ చౌదరి. 'యఙ్ఞం' చిత్రం దర్శకుడిగా రవికుమార్ చౌదరికి మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

ఆ తర్వాత బాలకృష్ణతో 'వీరభద్ర', సాయిధరమ్ తేజ్ తో 'పిల్లా నువ్వు లేని జీవితం' వంటి చిత్రాలు తెరకెక్కించారు. ఇంకా 'సౌఖ్యం, ఆటాడిస్తా, తిరగబడరా సామీ' సినిమాలను రవికుమార్ చౌదరి రూపొందించారు. అయితే రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'తిరగబడరా సామీ' బాగా నిరాశపరిచింది. ఈ సినిమా పరాజయం పాలవ్వడంతో ఆయన తీవ్ర మనో వేదనకు గురైనట్టు సన్నిహితుల సమాచారం.

Tags

Next Story