‘యానిమల్’ స్టైల్లో ధోని!

ఓ వైపు క్రికెట్ మైదానంలో చక్రం తిప్పే మహేంద్ర సింగ్ ధోని.. మరోవైపు ఇంటెన్స్ సినిమాల స్పెషలిస్ట్ సందీప్ రెడ్డి వంగా.. ఈ ఇద్దరూ కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో కనిపించారంటే, ఆ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ అడ్వర్టైజ్మెంట్‌ను స్పెషల్‌గా మార్చింది ధోనికి ఇచ్చిన అవుట్ అండ్ అవుట్ మాస్ లుక్!
‘అర్జున్ రెడ్డి’తో సంచలనం రేపిన సందీప్ రెడ్డి వంగా, ‘యానిమల్’తో మాస్, ఎమోషన్ మేళవించిన ఓ సరికొత్త కథను చెప్పాడు. అలాంటి డైరెక్టర్ చేతిలో, ధోని ఓ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపిస్తే? నిజంగానే షాక్ తగిలేలా ఉంటుంది. త్వరలో విడుదల కానున్న ఓ ఎలక్ట్రిక్ సైకిల్ బ్రాండ్ కోసం వీరిద్దరూ కలిసి ఓ యాడ్ చేశారు. ఇందులో ధోనీ సీరియస్ లుక్, మాస్ వేషధారణ, అతడి స్టైల్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘యానిమల్’ మూవీ స్టైల్‌లో రూపొందించిన ఈ ప్రోమోలో ధోనీని ఊహించని కోణంలో చూపించి సందీప్ వంగా మరోసారి తన టాలెంట్‌ను ప్రూవ్ చేశాడు. క్రికెట్ లెజెండ్‌కు అలా మాస్ టచ్ ఇవ్వగలిగిన డైరెక్టర్‌గా సందీప్ వంగా మరోసారి చర్చనీయాంశంగా మారాడు.
-
Home
-
Menu