జపాన్‌లోనూ ‘దేవర’ హిట్

మన సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియాలోనే కాదు.. పాన్ వరల్డ్ రేంజులో కూడా దుమ్మురేపుతున్నాయి. అందుకు లేటెస్ట్ ఎగ్జాంఫుల్ ‘దేవర‘. ఇప్పటికే ఇండియాలో అదరగొట్టిన ‘దేవర‘ ఇటీవల జపాన్ దేశంలోనూ విడుదలైంది. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా ఎన్టీఆర్, కొరటాల శివ జపాన్ వెళ్లారు. అక్కడ ‘దేవర‘ని గ్రాండ్ లెవెల్ లో ప్రమోట్ చేశారు.
లేటెస్ట్ గా జపాన్ లోనూ ‘దేవర‘ మంచి విజయాన్ని సాధించినట్టు తెలుస్తోంది. అక్కడ సక్సెస్ ఫుల్ గా ఈ చిత్రం మూడు వారాలు పూర్తిచేసుకుని.. నాల్గవ వారంలోకి ఎంటరైంది. జపాన్ లో భారతీయ సినిమాలకు ఉన్న పరిమిత మార్కెట్ ను దాటి, ఒక కమర్షియల్ యాక్షన్ డ్రామా ఇంత స్థాయిలో ఆడటం విశేషమే.
ఈ విజయం వెనుక ఎన్టీఆర్ మాస్ అప్పీల్ తో పాటు, కొరటాల శివ కథను చెప్పిన శైలి, అనిరుధ్ అందించిన సంగీతం కూడా కీలక పాత్ర పోషించాయని చెప్పొచ్చు. ఇక ‘దేవర‘కి సీక్వెల్ గా ‘దేవర 2‘ రాబోతున్నట్టు ఇప్పటికే వెల్లడించాడు తారక్.
-
Home
-
Menu