'విశ్వంభర' నుంచి క్రేజీ అప్డేట్!

విశ్వంభర నుంచి క్రేజీ అప్డేట్!
X
మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్‌గా మారింది. 'విశ్వంభర'ను విశ్వవ్యాప్తం చేసేందుకు నిర్మాత విక్రమ్ రెడ్డి, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్‌గా మారింది. 'విశ్వంభర'ను విశ్వవ్యాప్తం చేసేందుకు నిర్మాత విక్రమ్ రెడ్డి, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేస్తున్నారు. కేన్స్ లో 'విశ్వంభర'కు సంబంధించి ఒక 'ఎపిక్ రివీల్' వీడియోను ఆవిష్కరించబోతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను యు.వి.క్రియేషన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

‘అంజి’ తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ఇది. మాగ్నమ్ ఓపస్‌గా వశిష్ట మల్లిడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 'మెగా మాస్ బియాండ్ యూనివర్స్' అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది.



Tags

Next Story