'కింగ్‌డమ్' గురించి క్రేజీ అప్డేట్!

కింగ్‌డమ్ గురించి క్రేజీ అప్డేట్!
X
టాలీవుడ్‌ నుంచి భారీ అంచనాల మధ్య రాబోతున్న ప్రాజెక్ట్స్ లో ‘కింగ్ డమ్‘ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన టీజర్‌ ద్వారా భారీ ఆసక్తిని కలిగించింది.

టాలీవుడ్‌ నుంచి భారీ అంచనాల మధ్య రాబోతున్న ప్రాజెక్ట్స్ లో ‘కింగ్ డమ్‘ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన టీజర్‌ ద్వారా భారీ ఆసక్తిని కలిగించింది. అయితే ‘కింగ్ డమ్‘ అనుకున్న సమయానికి రావడం కష్టమేనని.. ఈ సినిమా వాయిదా పడబోతుందనే న్యూస్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. లేటెస్ట్ గా వాటిన్నంటికీ సమాధానం దొరికేసింది.

తాజాగా విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ‘కింగ్‌డమ్‘ ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయింది అని తెలిపాడు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో కలిసి స్టూడియోలో డిస్కషన్‌లో ఉన్న ఫోటోను కూడా షేర్ చేశాడు. ఈ ఫోటోతో సినిమా రిలీజ్ పై వస్తోన్న సందేహాలకు ఫుల్ స్టాప్ పడినట్టు అయ్యింది.

ఇక ఈ సినిమాలో విజయ్ పవర్ ఫుల్ ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. విజయ్ కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే కనిపించనుంది. అనిరుధ్ సంగీతం ‘కింగ్ డమ్‘ను మరో లెవెల్ లో నిలబెడుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉంది టీమ్. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ‘కింగ్ డమ్‘ మే 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Tags

Next Story