‘కన్నప్ప‘ రిలీజ్ కు కౌంట్ డౌన్!

‘కన్నప్ప‘ రిలీజ్ కు కౌంట్ డౌన్!
X
విష్ణు మంచు ‘కన్నప్ప‘ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 27న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఈ మూవీలో శివుడి పాత్రలో కనిపించే అక్షయ్ కుమార్ పోస్టర్ తో సినిమా విడుదల తేదీని మరోసారి గుర్తు చేశాడు విష్ణు.

విష్ణు మంచు ‘కన్నప్ప‘ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. జూన్ 27న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా ఈ మూవీలో శివుడి పాత్రలో కనిపించే అక్షయ్ కుమార్ పోస్టర్ తో సినిమా విడుదల తేదీని మరోసారి గుర్తు చేశాడు విష్ణు. ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ ‘కన్నప్ప‘ విడుదలకు ఇంకా 40 రోజులే ఉందంటూ తన పోస్ట్ లో తెలిపాడు.

ఈ చిత్రంలో శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించనుండగా, పార్వతీ దేవి పాత్రలో కాజల్ నటించింది. ఇతర కీలక కేమియోలలో ప్రభాస్, మోహన్ లాల్ వంటి వారు కనువిందు చేయబోతున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ‘కన్నప్ప‘ ప్రచారం కోసం ఇటీవల అమెరికా వెళ్లాడు విష్ణు. ఇంకా.. మునుముందు ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్తేందుకు మరింత దూకుడుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించబోతున్నాడు.



Tags

Next Story