కామెడీ సినిమాలు ఆరోగ్యానికి మంచివి – నాగచైతన్య!

కామెడీ సినిమాలు ఆరోగ్యానికి మంచివి – నాగచైతన్య!
X
‘మ్యాడ్’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు.

‘మ్యాడ్’ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. మార్చి 28న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అక్కినేని నాగచైతన్య హాజరై, 'మ్యాడ్ స్క్వేర్' ట్రైలర్‌ను ప్రశంసించాడు. 'ఇది మ్యాడ్ స్క్వేర్ కాదు, మ్యాడ్ మ్యాక్స్!' అంటూ హాస్యపూరితంగా స్పందించాడు. మ్యాడ్ సినిమాలు ఒత్తిడిని దూరం చేసేందుకు మంచి మార్గమని, ఇలాంటి వినోదాత్మక చిత్రాలు ఆరోగ్యానికి కూడా మంచివని అభిప్రాయపడ్డాడు. 'డల్‌గా అనిపించినప్పుడు, డాక్టర్లు కూడా మ్యాడ్ లాంటి సినిమా చూడమని సూచించాలి' అని వ్యాఖ్యానించాడు. కామెడీ చిత్రాలు రూపొందించడం చాలా కష్టమని, నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్‌లలో ఉన్న టైమింగ్, టాలెంట్‌ వల్లే వారు ప్రేక్షకులను నవ్వించగలిగారని ప్రశంసించాడు.

ఈ వేడుకలో దర్శకుడు వెంకీ అట్లూరి, మారుతి వంటి దర్శకులు కూడా ఈ చిత్ర బృందాన్ని అభినందించారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ సమర్పిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చాడు.

Tags

Next Story