'మీసాల పిల్ల'తో మెగా స్టోరీపై క్లారిటీ?

మీసాల పిల్లతో మెగా స్టోరీపై క్లారిటీ?
X
మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి వచ్చిన ‘మీసాల పిల్లా’ ఇన్‌స్టెంట్‌గా హిట్ అయ్యింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో, ఈ పాట మెలోడీ మ్యాజిక్‌తో ప్రేక్షకుల మనసులు దోచేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి వచ్చిన ‘మీసాల పిల్లా’ ఇన్‌స్టెంట్‌గా హిట్ అయ్యింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో, ఈ పాట మెలోడీ మ్యాజిక్‌తో ప్రేక్షకుల మనసులు దోచేస్తోంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరచగా, భాస్కరభట్ల రాసిన ఈ సాహిత్యాన్ని లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించారు.

చిరంజీవి సినిమాల్లో ఎన్నో మ్యూజిక్ బ్లాక్‌బస్టర్లకు గాత్రం అందించిన ఉదిత్ నారాయణ్‌తో మళ్లీ కాంబినేషన్ కుదరడం అభిమానుల్లో నాస్టాల్జియా రేపుతోంది. 'రాజీ పడదామంటే రావే మాజీ ఇల్లాలా!' ఈ ఒక్క లైన్ చాలు, సినిమా థీమ్‌పై స్పష్టత ఇస్తుంది. చిరంజీవి–నయనతార జంట మధ్య విడాకుల ట్రాక్ నడుస్తుందన్న సంకేతాలు ఈ పాటలోనే దాగున్నాయి.

అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో, భీమ్స్ మెలోడీతో, ఉదిత్ నారాయణ్ నాస్టాల్జిక్ టచ్‌తో ఈ సాంగ్ స్లో పాయిజన్‌లా మనసును కట్టి పడేస్తోంది. అలాగే పాట లిరిక్స్‌లో ఒక చిన్న డ్రామా ఉంది. మాజీ భార్యతో వాగ్వాదాలు, అతని బ్రతిమాలింపు, చివరికి దుప్పటి ముసుగుతన్ని సోఫాలో నిద్రలోకి జారిపోవడం.. అన్నీ ఒక ప్రేమకథను సున్నితంగా చెబుతున్నాయి.

చిరంజీవి–నయనతార కెమిస్ట్రీ, భీమ్స్ ట్యూన్, భాస్కరభట్ల సాహిత్య తీయదనం కలగలసి ‘మీసాల పిల్ల’ని సూపర్ హిట్ సాంగ్ గా నిలిపాయి. ఈ పాటతో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వచ్చే సంక్రాంతి బరిలో 'మన శంకరవరప్రసాద్ గారు' థియేటర్లలోకి రాబోతుంది.



Tags

Next Story