‘స్పిరిట్’ హీరోయిన్‌పై క్లారిటీ!

ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందనున్న చిత్రం 'స్పిరిట్'. పాన్ వరల్డ్ కాన్సెప్ట్‌తో పవర్‌ఫుల్ పోలీస్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తవ్వగా, ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హీరోయిన్ గా దీపికా ఎంపికైనట్టు.. లేటెస్ట్‌గా తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.
ఈనేపథ్యంలో 'స్పిరిట్' హీరోయిన్ పై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది టీమ్. 'యానిమల్' బ్యూటీ త్రిప్తి డిమ్రీని ఈ మూవీలో హీరోయిన్ గా ఫైనలైజ్ చేశాడు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సందీప్ రెడ్డి వంగా. ఈ విషయాన్ని దర్శకుడు సందీప్ తన భద్రకాళి పిక్చర్స్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించాడు.
9 భాషల్లో 'స్పిరిట్' విడుదలకానుంది. దీంతో హీరోయిన్ త్రిప్తి డిమ్రీ పేరును తెలుగుతో పాటు ఈ చిత్రం విడుదలకానున్న తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రాసి ప్రకటించటం విశేషంగా మారింది. ఈ అనౌన్స్‌మెంట్ తో 'స్పిరిట్' పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో తీర్చిదిద్దబోతున్నట్టు అర్థమవుతుంది.
ఈ చిత్రానికి ఇప్పటికే హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్సయ్యాడు. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. మూవీ షూటింగ్ కోసం మెక్సికోలో కొన్ని లొకేషన్లను పరిశీలించింది టీమ్. ఇందులో ప్రతినాయకుడిగా దక్షిణ కొరియా స్టార్ మా డాంగ్-సియోక్ పేరు పరిశీలనలో ఉంది. త్వరలోనే 'స్పిరిట్' సెట్స్ పైకి వెళ్లనుంది.
-
Home
-
Menu