అంజనాదేవి ఆరోగ్యంపై స్పష్టత

అంజనాదేవి ఆరోగ్యంపై స్పష్టత
X
చిరంజీవి తల్లి అంజనా దేవి అరోగ్యం బాగా లేదని.. అందుకే ఏపీ క్యాబినెట్ మీటింగ్ నుంచి పవన్ కళ్యాణ్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

చిరంజీవి తల్లి అంజనా దేవి అరోగ్యం బాగా లేదని.. అందుకే ఏపీ క్యాబినెట్ మీటింగ్ నుంచి పవన్ కళ్యాణ్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే మెగా పి.ఆర్. టీమ్ నుంచి అందిన సమాచారం మేరకు అంజనాదేవి గారి ఆరోగ్యం బాగానే ఉందట.

ఆమె కేవలం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు తప్ప ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి లేదని వైద్యులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ డాక్టర్లు ఇంటికే వచ్చి చికిత్స అందించినట్టు సమాచారం. మరోవైపు రామ్ చరణ్ భార్య ఉపాసన పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియోలో అంజనాదేవి కుటుంబసభ్యులతో కలిసి పచ్చడులను రుచి చూస్తూ, సరదాగా ముచ్చటిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఇది కొన్ని గంటల క్రితమే పోస్ట్ కావడం, అందులో ఆమె ఆరోగ్యంగా కనిపించడం, ఆమె ఆర్యగ్యపరమైన రూమర్స్ కు పూర్తిగా చెక్ పెట్టినట్లు అయ్యింది.

Tags

Next Story