చిరు ప్రాజెక్ట్ – నానికి క్రేజీ ఛాలెంజ్!

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ గా ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా యూట్యూబ్ ఛానెల్ కోసం అనుపమ చోప్రాకి ఇచ్చిన ఇంటర్యూలో తన సినిమాల గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు. ప్రస్తుతం హీరోగా, నిర్మాతగా వరుస విజయాలు అందుకుంటున్న నాని.. తన కథల ఎంపికలో ప్రత్యేకమైన దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పాడు.
సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లతో మాత్రమే కాకుండా, పరాజయాలను ఎదుర్కొంటున్న దర్శకులతోనూ తాను పనిచేయడానికి సిద్ధంగా ఉంటానని తెలిపాడు. కథ ప్రధానమని, మిగతా అంశాల గురించి పట్టించుకోనని స్పష్టం చేశాడు.
ప్రస్తుతం ‘హిట్ 3, ది ప్యారడైజ్’ చిత్రాలతో బిజీగా ఉన్న నాని, ఇటీవల నిర్మించిన ‘కోర్ట్’ సినిమా గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. అసలు ‘కోర్ట్‘ మూవీ థియేటర్లలో చూడరని తన టీమ్ కూడా భావించినట్టు నాని చెప్పాడు. అయితే ‘కోర్ట్‘ చిత్రం థియేటర్లలో బ్లాక్ బస్టర్ అవుతుందని తాను భావించానని.. చివరకు అదే నిజమైందని నాని అన్నాడు.
ఇక ‘హిట్’ ఫ్రాంచైజీ ముందుగా ప్లాన్ చేసినదేమీ కాదని చెప్పాడు నాని. తాను హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ‘హిట్ 3’ మాస్ యాక్షన్ ఫిల్మ్‌గా ఉంటుందని, ‘ది ప్యారడైజ్’ మాత్రం పూర్తిగా విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించబోతుందని నాని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
అలాగే తన నిర్మాణ సంస్థలో చిరంజీవి నటిస్తున్న ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, అది అనుకోకుండా సాధ్యమైన గొప్ప అవకాశం అని, ఆ చిత్రాన్ని తాను ఎంతో బాధ్యతగా భావిస్తున్నట్లు నాని వెల్లడించాడు.
-
Home
-
Menu