చిరు-పవన్ మల్టీస్టారర్.. ఆర్జీవి కోరిక!

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఒక 'మెగా పవర్' వరం లాంటిది అవుతుంది అని.. అలాగే అలాంటి సినిమా నిజంగా శతాబ్దపు 'మెగా పవర్' సినిమాగా నిలుస్తుందని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు.
ఈరోజుతో చిరంజీవి చిత్రసీమకు ప్రవేశించి 47 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. తన అన్నయ్య తొలి సినిమా కబుర్లను సోషల్ మీడియాలో పంచుకున్నాడు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పోస్ట్ చేసిన ట్వీట్ ను షేర్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ.. చిరు-పవన్ కలిసి మల్టీస్టారర్ చేయాలనే కోరికను బయట పెట్టాడు.
అయితే.. ఇటీవల మెగా ఫ్యామిలీకి యాంటీగా ఉన్న వర్మ ఒక్కసారిగా వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్ కావాలని అడగడం ఏంటి? ఆర్జీవి మళ్లీ మెగా క్యాంప్ కు వచ్చేశాడా? అనే గుసగుసలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఇదిలావుంటే.. మరోవైపు చిరు-పవన్ మల్టీస్టారర్ అనేది మెగా ఫ్యాన్స్ కోరిక కూడా. గతంలో చిరంజీవి 'శంకర్ దాదా జిందాబాద్' కోసం పవన్ కేమియోలో మురిపించాడు. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత సుబ్బిరామిరెడ్డి చిరు-పవన్ తో మల్టీస్టారర్ చేయడానికి ప్రయత్నాలు చేశారు.. కానీ.. కుదరలేదు. మరి.. మునుముందైనా మెగాస్టార్-పవర్ స్టార్ కాంబోలో మల్టీస్టారర్ వస్తుందేమో చూడాలి.
And you both will be doing the entire telugu people of the world a MEGA POWER favour, if you do a film together , and that will be the MEGA POWER film of the CENTURY 💪 https://t.co/BgrrCzTnC8
— Ram Gopal Varma (@RGVzoomin) September 22, 2025
-
Home
-
Menu