చిరు-అనిల్ మూవీ పట్టాలెక్కనుంది!

చిరు-అనిల్ మూవీ పట్టాలెక్కనుంది!
X
టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తున్న ప్రాజెక్టులలో చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా ఒకటి. చిరంజీవితో తన మార్క్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధమవుతున్నాడు అనిల్ రావిపూడి.

టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తున్న ప్రాజెక్టులలో చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమా ఒకటి. చిరంజీవితో తన మార్క్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధమవుతున్నాడు అనిల్ రావిపూడి. ఇటీవలే ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు. ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి రావడంతో ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 22 నుంచి ప్రారంభమవనుందట. ప్రస్తుతం యూకే టూర్‌లో ఉన్న చిరంజీవి మే మూడోవారంలో తిరిగి హైదరాబాద్‌కు రాగానే, చిత్ర బృందంతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారట. ఆ తర్వాత కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ సందడిగా ఉండే పాట షూట్‌తో సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన నయనతార, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం. మెగాస్టార్-నయనతార కాంబినేషన్ గతంలో ‘సైరా, గాడ్ ‌ఫాదర్’ వంటి సినిమాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. అయితే 'సైరా'లో చిరుకి జోడీగా నటించిన నయన.. 'గాడ్ ఫాదర్'లో చెల్లెలి పాత్రలో కనిపించింది. ఇప్పుడు మూడోసారి వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి టార్గెట్ గా రెడీ చేయబోతున్నారు.

Tags

Next Story