తిలక్ వర్మకు చిరు సత్కారం!

తిలక్ వర్మకు చిరు సత్కారం!
X
టీమిండియా యువ క్రికెటర్, తెలుగు తేజం తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా అభినందించారు. ఇటీవల ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మను, చిరంజీవి తన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సెట్స్‌కి ఆహ్వానించారు.

సెట్లోకి వచ్చిన తిలక్ వర్మను చిరంజీవి స్వయంగా సత్కరించి, కేక్ కట్ చేయించి, మూవీ టీమ్ సభ్యులను పరిచయం చేశారు. తిలక్ ప్రతిభను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మెగాస్టార్ ఆశీర్వదించారు. ఈ ఈ సన్మాన కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సుస్మిత కొణిదెల, హీరోయిన్లు నయనతార, కేథరిన్ కూడా పాల్గొన్నారు. తిలక్ వర్మ సన్మానానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story