బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్

బాలకృష్ణ వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్
X
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. సీఎం జగన్ హయాంలో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొన్న ఇబ్బందులపై చర్చ జరుగుతుండగా, బాలకృష్ణ "ఆ సైకో" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. సీఎం జగన్ హయాంలో సినీ ఇండస్ట్రీ ఎదుర్కొన్న ఇబ్బందులపై చర్చ జరుగుతుండగా, బాలకృష్ణ "ఆ సైకో" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాక, సినీ పరిశ్రమ తరఫున జగన్‌ను కలిసిన సమయంలో చిరంజీవి గట్టిగా అడిగారని కామినేని శ్రీనివాస్ చెప్పిన వ్యాఖ్యలను ఖండించారు.

దీనిపై మెగాస్టార్ చిరంజీవి లేఖ ద్వారా స్పందించారు. “నేను గట్టిగా మాట్లాడితే జగన్ దిగివచ్చారన్నది అబద్ధం. సీఎం స్వయంగా నన్ను లంచ్‌కు ఆహ్వానించారు. అక్కడే ఇండస్ట్రీ సమస్యలు వివరించాను. నేను ఎప్పుడూ సీఎం అయినా, సామాన్యుడైనా గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధంగానే మాట్లాడుతాను” అని స్పష్టం చేశారు.

అంతేకాక, అప్పట్లో బాలకృష్ణను ఫోన్ ద్వారా సంప్రదించినా ఆయన అందుబాటులోకి రాలేదని, జెమినీ కిరణ్‌ను పంపినా కలవలేకపోయారని వివరించారు. తాను తీసుకున్న చొరవ వల్లే ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అంగీకరించిందని, దాంతో 'వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య' సినిమాలకు కూడా లాభం చేకూరిందని గుర్తు చేశారు. ఈ వివరణతో అసెంబ్లీలో మొదలైన వివాదానికి చిరంజీవి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

Tags

Next Story