చిరంజీవి-బోయపాటి కాంబినేషన్!

చిరంజీవి-బోయపాటి కాంబినేషన్!
X
మెగాస్టార్ చిరంజీవి – బోయపాటి శ్రీను కాంబినేషన్ పై రూమర్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వశిష్ఠ, అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల వంటి యువ దర్శకులతో చిరు సినిమా లైనప్ ఫుల్ గా ఉండగా, ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను‌తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి – బోయపాటి శ్రీను కాంబినేషన్ పై రూమర్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వశిష్ఠ, అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల వంటి యువ దర్శకులతో చిరు సినిమా లైనప్ ఫుల్ గా ఉండగా, ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను‌తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ కాంబోపై ఎప్పటినుంచో టాక్ ఉన్నా.. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

ప్రస్తుతం బోయపాటి.. బాలకృష్ణ కాంబోలో 'అఖండ 2' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఆ తర్వాత బోయపాటి చేయబోయేది చిరంజీవి సినిమా అనే టాక్ వినిపిస్తుంది. గతంలో బోయపాటి చిరంజీవిని కలిసి ఓ కథ వినిపించాడట. అందులో చిరు ప్రొఫెసర్ క్యారెక్టర్‌లో కనిపిస్తాడట. చిరు ‘ఠాగూర్’ తరహాలో ఆ క్యారెక్టర్ సైలెంట్ గా కనిపిస్తూనే ఎంతో వయలెంట్ గా కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది.

చిరంజీవి-బోయపాటి కాంబోని ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్, 14 రీల్స్ సెట్ చేశాయని తెలుస్తోంది. ఇప్పటికే ఎ.కె. ఎంటర్‌ టైన్ మెంట్స్ లో చిరంజీవి చేసిన 'భోళాశంకర్' బాగా నిరాశపరిచింది. ఈనేపథ్యంలోనే బోయపాటితో సినిమాని ఆ సంస్థకు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మెగాస్టార్. చిరంజీవి 'విశ్వంభర, మెగా 157' తర్వాత బోయపాటి చిత్రం పట్టాలెక్కే అవకావాలున్నాయట.

Tags

Next Story