చరణ్ కెరీర్ కు 18 ఏళ్లు

2007 సెప్టెంబర్ 28.. తెలుగు సినీ పరిశ్రమలో కొత్త అధ్యాయం మొదలైంది. చిరంజీవి వారసుడిగా, మెగా ఫ్యామిలీకి కొత్త హీరోగా రామ్ చరణ్ తన తొలి చిత్రం ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయాన్ని సాధించి, చరణ్‌కి మంచి బేస్ ఇచ్చింది. తొలి సినిమాతోనే చరణ్ ఎనర్జీ, డ్యాన్స్, ఫైట్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఇక రెండో సినిమాకే రామ్ చరణ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ దొరికింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’ తెలుగు సినిమా చరిత్రలోనే మైలు రాయిగా నిలిచింది. యాక్షన్, రొమాన్స్, రీ ఇన్కార్నేషన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం చరణ్‌ను టాప్ స్టార్‌గా నిలబెట్టింది.
ఆ తర్వాత వచ్చిన ‘రచ్చ, నాయక్, ఎవడు, ధ్రువ’ వంటి సినిమాలు రామ్ చరణ్ ను కమర్షియల్ హీరోగా మరింత బలపరిచాయి. యాక్షన్ నుంచి స్టైల్ వరకు అన్ని రకాల రోల్స్‌లో రామ్ చరణ్ తనకంటూ ప్రత్యేకతను చూపించాడు. ఇక ‘రంగస్థలం‘లో బుచ్చిబాబుగా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు. అంతకుముందు వరకూ చరణ్ అంటే కేవలం డ్యాన్స్, ఫైట్స్ మాత్రమే గుర్తొచ్చేవి. ‘రంగస్థలం‘తో నటుడిగానూ నిరూపించుకున్నాడు.
‘మగధీర‘ తర్వాత మరోసారి చరణ్ తో రాజమౌళి రూపొందించిన ‘ఆర్.ఆర్.ఆర్’ అంతర్జాతీయంగా విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్ర గ్లోబల్ లెవెల్ లో ప్రశంసలు పొంది.. ఈ మెగా హీరోని గ్లోబల్ స్టార్ గా నిలిపింది. మొత్తంగా.. ‘చిరుత‘తో మొదలైన చెర్రీ ప్రస్థానానికి రేపటితో 18 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ పద్దెనిమిదేళ్లలో కేవలం 15 సినిమాలు మాత్రమే చేసిన చరణ్.. ఇప్పుడు తన 16వ చిత్రంగా ‘పెద్ది‘, 17వ సినిమాని సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు.
-
Home
-
Menu