'శుభం' చిత్రానికి చరణ్ సపోర్ట్!

శుభం చిత్రానికి చరణ్ సపోర్ట్!
X
సమంత నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

సమంత నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అలాగే 'శుభం' చిత్రానికి సెలబ్రిటీల మద్దతు కూడా లభిస్తుంది. ఇప్పటికే సామ్ కు పలువురు సినీ ప్రముఖుల నుంచి 'శుభం' చిత్రానికి శుభాకాంక్షలు అందాయి.

లేటెస్ట్‌గా ఈ లిస్టులోకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరాడు. 'శుభం గురించి ఫ్యామిలీల నుంచి మంచి మాటలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ చాలా ఫన్‌గా అనిపించింది. ఈ సినిమాను నా కుటుంబంతో కలిసి చూడటానికి ఎదురుచూస్తున్నాను. ఇలాంటి కొత్తదనంతో కూడిన చిత్రాలను మనం ప్రోత్సహించాలి. సమంతకు, ఆమె టీమ్‌కి శుభాకాంక్షలు' అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నాడు చరణ్.

రామ్ చరణ్ ట్వీట్‌కి స్పందించిన సమంత, ఆయన అభినందనలు తనకు ఎంతో ఆనందం కలిగించాయని తెలిపింది. గతంలో అనారోగ్య సమస్యల కారణంగా సినిమాల నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చిన సమంత, సెకండ్ ఇన్నింగ్స్‌ను నిర్మాతగా మొదలుపెట్టింది. ‘శుభం’ ద్వారా ఆమె తీసుకున్న ఈ కొత్త దారిలో మునుముందు ఎలాంటి సినిమాలు వస్తాయో చూడాలి.



Tags

Next Story