'హిట్ 3'కి చరణ్, చైతూ ప్రశంసలు!

హిట్ 3కి చరణ్, చైతూ ప్రశంసలు!
X
నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది.

నేచురల్ స్టార్ నాని నటించిన ‘హిట్ 3’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాని ఇచ్చిన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తుండగా, కలెక్షన్ల పరంగా కూడా రెండు రోజుల్లోనే రూ.62 కోట్లు దాటి పెద్ద సక్సెస్‌ను నమోదు చేసింది.

ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'హిట్ 3' బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశాడు. నాని మరియు చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించాడు. 'హిట్ 3'కి వచ్చిన అద్భుతమైన స్పందన చూసి సంతోషంగా ఉంది. మై డియర్ బ్రదర్ నాని.. ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ మంచి విజయాలు సాధిస్తున్నావు. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఇంటెన్స్ కథకు హ్యాట్సాఫ్,’ అంటూ చరణ్ ట్వీట్ చేశాడు. అలాగే శ్రీనిధి శెట్టి, నిర్మాత ప్రశాంతి త్రిపురనేని, వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ సినిమా టీమ్‌కి కూడా శుభాకాంక్షలు తెలిపాడు.

'హిట్ 3' బృందానికి నాగచైతన్య కూడా అభినందనలు తెలియజేశాడు. 'హిట్ 3' పెద్ద విజయానికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూనే 'హిట్' ఫ్రాంచైజీని ఇంకా బలంగా, విశ్వసనీయంగా మార్చుతున్న విధానం అభినందనీయం అంటూ చిత్రబృందాన్ని పొగడ్తలతో ముంచెత్తాడు చైతూ.





Tags

Next Story