రెమ్యునరేషన్ రికార్డ్స్ బ్రేక్!

రెమ్యునరేషన్ రికార్డ్స్ బ్రేక్!
X
ఇండియన్ సినిమా గత పదేళ్లలో పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంది. కంటెంట్ పరంగా హాలీవుడ్ మూవీస్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో భారతీయ చిత్రాలు సిద్ధమవుతున్నాయి.

ఇండియన్ సినిమా గత పదేళ్లలో పాన్ వరల్డ్ స్థాయికి చేరుకుంది. కంటెంట్ పరంగా హాలీవుడ్ మూవీస్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో భారతీయ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. అలా.. ఇండియన్ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ లెవెల్ లో రెడీ అవుతున్న ప్రాజెక్ట్ అల్లు అర్జున్ - అట్లీ చిత్రం. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కావడం ఒక్కటే కాదు, దాని వెనుక ఉన్న బడ్జెట్, టాలెంట్, టెక్నాలజీ పరంగా ఇది దేశంలోనే అతి భారీ ప్రాజెక్టుగా నిలవబోతోందనే అంచనాలున్నాయి.

ఇప్పటివరకూ మాస్ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరైన అట్లీ, ఈసారి తన దృష్టిని అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తున్నాడు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వీడియో ఈ ప్రాజెక్ట్ స్కేల్‌ను బయటపెట్టింది. ఇప్పటికే చాన్నాళ్లుగా ప్రీ-ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమాకోసం సన్ పిక్చర్స్ దాదాపు రూ.800 కోట్లకు పైగా ఖర్చు పెట్టడానికి సిద్ధమవ్వడం విశేషం.

ఈ బడ్జెట్‌లో కేవలం పారితోషకాలకే రూ.350 కోట్లు కేటాయించబోతున్నారట. బన్నీకి రూ.200 కోట్లు, అట్లీకి రూ.100 కోట్లు పైగా ఇవ్వనుండడం ఇండియన్ సినిమా చరిత్రలోనే సంచలనంగా మారింది. మిగతా టెక్నికల్ టీమ్ కు, ఇంటర్నేషనల్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలకు కలిపి ప్రొడక్షన్ ఖర్చు మరో రూ.400 కోట్ల వరకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

'పుష్ప-2' తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా కావడం, 'జవాన్' వంటి హిట్ తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. మొత్తంగా కాన్సెప్ట్, స్కేల్, స్టార్డమ్, టెక్నాలజీ... అన్ని రంగాల్లో బన్నీ-అట్లీ మూవీ గేమ్ ఛేంజర్ అవుతుందని సినీ ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.

Tags

Next Story