బన్నీ – అట్లీ కలయిక.. సెంటిమెంట్ బ్రేక్ చేస్తోందా?

బన్నీ – అట్లీ కలయిక.. సెంటిమెంట్ బ్రేక్ చేస్తోందా?
X
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేక్షకుల అభిరుచులు, భావోద్వేగాలు సినిమాల విజయానికి కీలక అంశాలు. ముఖ్యంగా "నేటివిటీ" అనే పదం ఎన్నో ప్రాజెక్టుల భవితవ్యాన్ని నిర్ణయించేస్తోంది.

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రేక్షకుల అభిరుచులు, భావోద్వేగాలు సినిమాల విజయానికి కీలక అంశాలు. ముఖ్యంగా "నేటివిటీ" అనే పదం ఎన్నో ప్రాజెక్టుల భవితవ్యాన్ని నిర్ణయించేస్తోంది. గతంలో తమిళ దర్శకులు తెలుగు స్టార్ హీరోలతో చేసిన ప్రయోగాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో, అలాంటి కాంబినేషన్లపై ఒక అభద్రతా భావన నెలకొంది.

మురుగదాస్, లింగుస్వామి, వెంకట ప్రభు, శంకర్ వంటి తమిళ అగ్ర దర్శకులు తెలుగు హీరోలతో తడబడ్డారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ – అట్లీ కాంబో.. ఆ సెంటిమెంట్ ను అధిగమిస్తోందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

అట్లీకి భారీ బడ్జెట్‌ సినిమాలను హ్యాండిల్‌ చేసిన అనుభవం ఉంది. ఇక తెలుగు ప్రేక్షకుడి హృదయం గెలవాలంటే, విజువల్స్‌తో పాటు కథలో భావోద్వేగాలు నిండి ఉండాలి. ముఖ్యంగా స్టార్ హీరో ఉన్న సినిమాలలో ప్రతి లైన్, ప్రతి సీన్ కూడా అభిమానుల ఊహలకు తగినట్లుగా ఉండాలి. ఈ విషయంలోనే గత చిత్రాలు తడబడ్డాయి. కథలోని కోర్ ఎమోషన్ క‌నెక్ట్ కాలేకపోయింది.

అట్లీకి ఇది ఒక ఛాలెంజ్ మాత్రమే కాదు, అవకాశమూ. అల్లు అర్జున్‌ను కేంద్రంగా పెట్టుకుని, తెలుగునేటివిటీకి న్యాయం చేస్తూ తెరకెక్కిస్తే ఈ సినిమా ఓ ట్రెండ్‌సెట్టర్ కావచ్చు. అంతేకాదు, తమిళ దర్శకులపై ఉన్న సెంటిమెంట్‌ను కూడా మార్చే అవకాశం కలుగుతుంది. అయితే ఈసారి అట్లీ తన పంథా కు భిన్నంగా సూపర్ హీరో మూవీ తో వస్తున్నాడు. అల్లు అర్జున్ కి కూడా ఈ తరహా సూపర్ హీరో కాన్సెప్ట్ కొత్తదే. మరి హాలీవుడ్ సూపర్ హీరో మూవీస్ ని ఫాలో అవ్వకుండా ఇండియన్ టచ్ తో ఈ చిత్రాన్ని తీసుకొస్తే హిట్ గ్యారంటీ.

Tags

Next Story