'బైసన్' ట్రైలర్.. కబడ్డీ నుంచి సామాజిక పోరాటం!

కోలీవుడ్ చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం ‘బైసన్’. రా అండ్ రస్టిక్ స్టైల్ సినిమాలకు పేరుగాంచిన మారి సెల్వరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, మరో స్టార్ డైరెక్టర్ పా. రంజిత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. కబడ్డీ నేపథ్యంతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో ధ్రువ్ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.
గ్రామీణ వాతావరణం, సామాజిక సమస్యలు, రాజకీయ అంశాలు, కబడ్డీ పట్ల హీరోకి ఉన్న ప్యాషన్ ఇవన్నీ కలిసిన ప్యాకేజ్‌గా ట్రైలర్ ఆకట్టుకుంది. కబడ్డీ మైదానం నుంచి సామాజిక పోరాటం వరకు సాగిన హీరో ప్రయాణం ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ కానున్నట్టు తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్, ఎమోషన్స్ అన్నీ కలిపి ట్రైలర్ తో 'బైసన్'పై అంచనాలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 24న 'బైసన్' తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
-
Home
-
Menu