బ్యాంగర్ ఆఫ్ ‘తమ్ముడు‘

బ్యాంగర్ ఆఫ్ ‘తమ్ముడు‘
X
నితిన్ హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘తమ్ముడు‘. ‘వకీల్ సాబ్‘ ఫేమ్ శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషించారు.

నితిన్ హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘తమ్ముడు‘. ‘వకీల్ సాబ్‘ ఫేమ్ శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో లయ, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ కీలక పాత్రలు పోషించారు.జూలై 4న విడుదలకు ముస్తాబవుతోన్న ‘తమ్ముడు‘ నుంచి బ్యాంగర్ ఆఫ్ ‘తమ్ముడు‘ అంటూ స్పెషల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఇప్పటివరకూ ‘తమ్ముడు‘ చిత్రం అంటే అక్కా తమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని భావించారు. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని చూపిస్తూనే.. ఈ సినిమాకోసం డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నట్టు తెలుస్తోంది.

ఆర్చరీ క్రీడాకారుడిగా కనిపిస్తున్న నితిన్.. అక్క కోసం అడవుల బాట పట్టడం.. అక్కడ జరిగిన ఘర్షణలు వంటివి ట్రైలర్ లో హైలైట్ చేశారు. ‘కాంతార, విరూపాక్ష‘ ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మొత్తంగా ‘బ్యాంగర్ ఆఫ్ తమ్ముడు‘ నితిన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచిందని చెప్పాలి.



Tags

Next Story