పవర్ ఫుల్ కేమియోలో బాలయ్య

పవర్ ఫుల్ కేమియోలో బాలయ్య
X
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2‘తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మలినేని గోపీచంద్ తో మరో చిత్రం చేయనున్నాడు. ఇంకా.. ‘ఆదిత్య 369‘ సీక్వెల్ ‘ఆదిత్య 999‘ కూడా బాలయ్య కిట్టీలో ఉంది.

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2‘తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత మలినేని గోపీచంద్ తో మరో చిత్రం చేయనున్నాడు. ఇంకా.. ‘ఆదిత్య 369‘ సీక్వెల్ ‘ఆదిత్య 999‘ కూడా బాలయ్య కిట్టీలో ఉంది. సోలో హీరోగా చేసే సినిమాలను పక్కన పెడితే.. బాలకృష్ణ ఓ కేమియోలోనూ మురిపించడానికి ముస్తాబవుతున్నాడు.

సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైటింగ్ ‘జైలర్ 2‘లో బాలకృష్ణ ఓ పవర్ ఫుల్ కేమియోలో కనిపించనున్నాడనే న్యూస్ కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. లేటెస్ట్ గా ఆ కేమియో చిన్నది కాదని.. అదొక ఎక్స్ టెండెడ్ కేమియో అనే ప్రచారం జరుగుతుంది. ‘జైలర్ 2‘ కోసం బాలయ్య ఏకంగా 20 రోజుల కాల్షీట్స్ ఇవ్వబోతున్నాడనేది కోలీవుడ్ టాక్.

ఈ సినిమాలో రజనీకాంత్-బాలయ్య కాంబోలో వచ్చే సన్నివేశాను.. థియేటర్లలో పండగ వాతావరణాన్ని సృష్టించే విధంగా తీర్చిదిద్దుతున్నాడట డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. మరోవైపు బాలకృష్ణ కోసమే ప్రత్యేకమైన బి.జి.ఎమ్ ను రెడీ చేస్తున్నాడట మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్. మొత్తంగా.. ‘జైలర్ 2‘లో బాలయ్య ఎంట్రీపై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.

Tags

Next Story