బాలకృష్ణ క్లాసిక్‌ ‘ఆదిత్య 369’ రీ-రిలీజ్!

బాలకృష్ణ క్లాసిక్‌ ‘ఆదిత్య 369’ రీ-రిలీజ్!
X
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానం ఉన్న ‘ఆదిత్య 369’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ కెరీర్‌లో ప్రత్యేకమైన స్థానం ఉన్న ‘ఆదిత్య 369’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 1991లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ఏప్రిల్ 4న 4కే డిజిటలైజేషన్‌ వెర్షన్‌లో రీ-రిలీజ్ కు సిద్ధమైంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు.

ఈ రీ-రిలీజ్‌ను పురస్కరించుకుని హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించగా, బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారని, అందుకే ‘ఆదిత్య 369’లాంటి ప్రయోగాత్మక సినిమాను అందించగలిగామని తెలిపారు. తన తండ్రి ఎన్టీఆర్‌ నూతన ప్రయోగాలకు ఆదర్శంగా నిలిచారని, నటనలో వైవిధ్యం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తానని అన్నారు.

ఈ సినిమా విషయంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించారని, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసిన గొప్ప దర్శకుడని ప్రశంసించారు. అలాగే, ‘ఆదిత్య 369’ సీక్వెల్‌కి కథ సిద్ధమైందని, మొదలు పెడితే ఆపేది లేదని వెల్లడించారు.

ఈ సందర్భంగా తన సినీ ప్రస్థానం, రాజకీయ జీవితాన్ని కూడా ప్రస్తావించిన బాలకృష్ణ, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, ఓటీటీ వేదికపై కూడా కొత్త తరహా ప్రోగ్రామ్స్‌ చేశానని చెప్పారు. పద్మభూషణ్‌ పురస్కారం ఆలస్యంగా అందిందని చాలామంది అనుకున్నా, అది సరైన సమయానికే వచ్చిందని ఆయన పేర్కొన్నారు.



Tags

Next Story