'బలగం' నటుడు కన్నుమూత

ప్రముఖ రంగస్థల నటుడు, ‘బలగం’ సినిమాలో చిన్నతాత అంజన్నగా గుర్తింపు పొందిన జీవీ బాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన వరంగల్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
రెండు కిడ్నీలు దెబ్బతిన్న కారణంగా డయాలసిస్ చికిత్స తీసుకుంటున్న ఆయనకు గొంతు ఇన్‌ఫెక్షన్ రావడంతో మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు. చివరి రోజుల్లో కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దర్శకుడు వేణు, నటుడు ప్రియదర్శి ఆయనకు కొంత ఆర్థికసాయం చేశారు.
జీవీ బాబు మృతి పట్ల 'బలగం' దర్శకుడు వేణు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆయన జీవితం మొత్తం నాటకరంగానికే అంకితమయ్యింది. చివరి రోజుల్లో ఆయనను 'బలగం' సినిమాతో సినిమారంగానికి పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను‘ అని వేణు భావోద్వేగంగా తెలిపారు.
'బలగం' సినిమాలో ఆయన పోషించిన అంజన్న పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథను ముందుకు నడిపించే కీలక పాత్రలో జీవీ బాబు సహజమైన అభినయంతో మెప్పించారు. నటుడిగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ, ఆరోగ్య సమస్యలతో కుదేలయ్యారు. ఆయన మరణ వార్తతో సినీ, నాటక రంగాల్లో తీవ్ర విషాదం నెలకొంది. నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నారు.
జి వి బాబు గారు ఇకలేరు🙏
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) May 25, 2025
ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు..
చివరి రోజుల్లో ఆయన్ని బలగం ద్వారా పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది🙏🙏
అయన ఆత్మ శాంతించాలి అని కోరుకుంటున్నాను 💐🙏#balagam #artist #stage #plays #natakam pic.twitter.com/fzDHReHt8g
-
Home
-
Menu