శ్రీవిష్ణు మరో ఫన్ రైడ్!

శ్రీవిష్ణు హీరోగా కార్తిక్‌రాజు దర్శకత్వంలో రూపొందుతున్న '#సింగిల్' చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది. కేతిక శర్మ, ఇవానా ఈ సినిమాలో కథానాయికలుగా నటించగా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. గీతా ఆర్ట్స్ 2 పై అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భానుప్రతాప్, రియాజ్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటలకు మంచి స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది. ట్రైలర్ ఆద్యంతం శ్రీవిష్ణు స్టైల్ ఫన్ రైడ్ లా ఆకట్టుకుంటుంది. సింగిల్ అయిన శ్రీవిష్ణు.. తన కోసం జోడీని వెతుక్కునే క్రమంలో కేతిక శర్మ, ఇవానాలతో లవ్ లో పడతాడు. ఆ తర్వాత ఆ ఇద్దరితో లవ్ ట్రయాంగుల్ నడుపుతాడు. చివరకు ఈ సింగిల్ ఎవరితో మింగిల్ అయ్యాడన్నదే ఈ సినిమా స్టోరీగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. మొత్తంగా.. మంచి అంచనాలతో వేసవి కానుకగా మే 9న థియేటర్లలోకి వచ్చేస్తోంది శ్రీవిష్ణు '#సింగిల్'.
-
Home
-
Menu