శ్రీ విష్ణుకు మరో బంపర్ హిట్!

శ్రీ విష్ణుకు మరో బంపర్ హిట్!
X
శ్రీ విష్ణు హీరోగా, ఇవానా, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించిన "సింగిల్" చిత్రం థియేటర్లలో విజయవంతంగా దూసుకెళ్తోంది. కార్తీక్ రాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, రిలీజ్ అయిన మొదటి వారం రోజుల్లోనే రూ. 25 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకోవడంతో శ్రీ విష్ణు కెరీర్‌లో మరో భారీ హిట్‌గా నిలిచింది.

రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ వంటి అనుభవజ్ఞుల కామెడీ టచ్ తో, విశాల్ చంద్రశేఖర్ సంగీతమందించిన ఈ చిత్రం గీతా ఆర్ట్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ మధ్య హ్యూమర్ పండించిన సన్నివేశాలు పెద్దఎత్తున ఆకట్టుకున్నాయి. మౌత్ టాక్ బలంగా ఉండటంతో వీక్ డేస్‌లో కూడా మంచి కలెక్షన్లను రాబడుతోంది.

ఓవర్సీస్‌లో కూడా 'సింగిల్' మంచి రన్ చూపిస్తోంది. ఇప్పటికే $550K డాలర్ల మార్క్‌ను దాటడం, మిడిల్ రేంజ్ సినిమా కోణంలో అరుదైన విషయం. ఇండియన్ మార్కెట్‌లో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాక, ఇప్పుడు వచ్చిన ప్రతి రూపాయి లాభాలే అన్న చర్చ ట్రేడ్ సర్కిల్లో జోరుగా సాగుతోంది.

Tags

Next Story