'హరిహర వీరమల్లు' నుంచి అనౌన్స్‌మెంట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటింగ్ మూవీ 'హరిహర వీరమల్లు'పై ఎట్టకేలకు అప్డేట్ అందించింది టీమ్. జూన్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా పడింది. అయితే కొత్త విడుదల తేదీపై చిత్రబృందం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. సినిమా నుంచి ట్రైలర్, రిలీజ్ డేట్ అప్డేట్ ఇవ్వాలంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ డిమాండ్లు పెట్టారు.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రానికి లేటెస్ట్ గా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు మేకర్స్. రేపు ఉదయం 7:23 గంటలకు సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలియజేశారు. ఫ్యాన్స్ అయితే ఇప్పటికే జులై 24వ తేదీ ఫిక్స్ అయ్యిందని, రేపు అదే ప్రకటన వస్తుందని ఊహించుకుంటున్నారు.
క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించారు. పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ నటించగా కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కనిపించబోతున్నాడు. ఎమ్ఎమ్ కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మొత్తానికి.. మరికొద్ది గంటల్లోనే పవర్ స్టార్ 'వీరమల్లు' విడుదల తేదీపై అధికారిక ప్రకటన రాబోతుంది.
Get Ready for the Battle to begin 🔥
— Mega Surya Production (@MegaSuryaProd) June 20, 2025
The sword will speak louder than silence ⚔️
Join us tomorrow at 7:23 AM for the Release Date Announcement of #HariHaraVeeraMallu 💥#HHVM #DharmaBattle #VeeraMallu
-
Home
-
Menu