'హిట్ 3' కోసం అనిరుధ్!

ప్రెజెంట్ టాలీవుడ్ నుంచి భారీ అంచనాలతో రాబోతున్న చిత్రం 'హిట్ 3'. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న నేచురల్ స్టార్ నాని నటించిన చిత్రమిది. 'హిట్' సిరీస్ లో భాగంగా వస్తోన్న ఈ మూవీకి నాని నిర్మాత కూడా. మే 1న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.
శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రీసెంట్‌గా సెన్సార్ పూర్తి చేసుకుని ‘ఏ’ సర్టిఫికెట్ పొందింది. అధికంగా వయొలెన్స్ ఉండటమే ఇందుకు కారణం. సినిమా రన్‌టైమ్‌ను 2 గంటలు 37 నిమిషాలుగా మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా, సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి.
లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘తను’ రిలీజ్ కాబోతుంది. ఈరోజు (ఏప్రిల్ 25) సాయంత్రం 4:05 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ పాటను అనిరుధ్ రవిచందర్ ఆలపించడం విశేషం.
-
Home
-
Menu